ఉభయగోదావరి జిల్లాల పర్యాటక కేంద్రప్రాజెక్టు అఖండ గోదావరి – మంత్రి కందుల దుర్గేష్

రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం శుభ సందర్భంగా భావిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్

ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ బ్రిడ్జి, బ్రిడ్జిలంక, పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ దేవాలయం,గోదావరి కాలువను సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నాం:మంత్రి కందుల దుర్గేష్

అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసుకొని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను న్యూఢిల్లీలో కలిశాం..తొలి నుండి సంపూర్ణ సహకారం అందించి ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చారు: మంత్రి కందుల దుర్గేష్

అఖండ గోదావరి ప్రాజెక్టుకు సహకరించినందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీలకు ధన్యవాదాలు : మంత్రి కందుల దుర్గేష్

అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ధన్యవాదాలు : మంత్రి దుర్గేష్

డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి రాజమహేంద్రవరానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు : మంత్రి దుర్గేష్

127 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారు నిర్మించిన హేవలాక్ వంతెనను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి కందుల దుర్గేష్

హేవలాక్ వంతెనను కొత్త రూపు తేవాలన్న ఆలోచనకు చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నా కార్యరూపం దాల్చలేదు : మంత్రి కందుల దుర్గేష్

ఈ ప్రయత్నాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం వేస్తున్న తొలి మెట్టు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం : మంత్రి కందుల దుర్గేష్

ప్రాజెక్టులో భాగంగా పిచ్చుకలంకను, గోదావరి పరిసర ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విజ్ఞప్తి : మంత్రి కందుల దుర్గేష్

చారిత్రక, సాంస్కృతిక నగరంగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి విజ్ఞప్తి చేసిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరానికి మరింత ప్రోత్సాహం అందించి మెరుగైన నగరంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ గా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకశ్రద్ధ వహించాలని ఎంపీ పురందేశ్వరిని కోరిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం చరిత్ర, సంస్కృతిని పునరుజ్జీవింపజేయాలని ప్రజలను కోరిన మంత్రి దుర్గేష్

Scroll to Top
Share via
Copy link