తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
43 మంది రైతులకు పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు పంపిణీరైతు సంక్షేమం, అభివృద్ధి కోసం రైతు పక్షపాతి పని చేసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులకు ప్రాధాన్యత ఇచ్చే నేత అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, యాంత్రీకరణ రైతులకు అలవాటు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 43 మంది రైతులకు రూ. 1.02 కోట్లు విలువైన పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు యాభైశాతం రాయితీతో ఆదివారం తణుకులో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి ప్రత్యేక నిధులు కేటాయించి రైతులను ఆదుకునే విధంగా చంద్రబాబు విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట యాత్ర చేసి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. అధకారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు రూ. 20 వేలు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తూ కూటమి నాయకులు పని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


