ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నిర్వహించిన కార్గో పార్సిల్ & కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాలలో 321% గ్రోత్ తో తణుకు డిపో రాష్ట్రం లో ప్రధమ స్థానం విజయవాడ జోన్లో తాడేపల్లిగూడెం 302% గ్రోత్ తో రెండవ స్థానం సాధించడం ఫలితం గా పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రం లో ద్వితీయ స్థానం పొందడం చాలా అభినందనీయమని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్, పశ్చిమ గోదావరీ, ఏలూరు జిల్లాల ఉమ్మడి కార్గో కమర్శియల్ మేనేజర్ G. లక్ష్మి ప్రసన్న వెంకట సుబ్బారావు అన్నారు. ఈ సందర్బంగా విశిష్ట కృషి చేసిన డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు షేక్ లాల్, G. మాధవరావు మరియు అత్యధిక డోర్ డెలివరీ లు బుక్ చేసిన వినియోగదారుడు శ్రీ లావణ్య ఫీడ్స్ ప్రాప్రైటర్ కోసూరి సతీష్ వర్మ లను, తణుకు కార్గో టీం లీడర్ కనుమూరి సందీప్ మరియు ఆపరేటర్ లను, హమాలీలను సత్కరించారు. డోర్ డెలివరీ మాసోత్సవ 4 వ వారం మరియు బంపర్ డ్రా విజేతలను ప్రకటించారు. 3 వవారం విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమం లో సింగ్ సొల్యూషన్ ప్రాజెక్టు మేనేజర్ అరసాడ శ్రీధర్, ఆఫీస్ సూపరిండెంట్ వెన్నా రమణమూర్తి, ఆయిల్ డిపో క్లర్క్ మహమ్మద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్, అకౌంట్స్ సూపరిండెంట్ షేక్ పెంటు సాహెబ్, గ్యారేజ్ ఇంచార్జి చంద్రశేఖర్, రెండు జిల్లాల డి.యం.ఈ లు, టీం లీడర్ లు, తణుకు డిపో నాయకులు, సూపర్ వైజర్ లు, ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకు డిపో ఉద్యోగులు ప్రత్యేకంగా డి.యం.ఈ.షేక్ లాల్ ను అభినందించారు.


