కారుమూరు నాగేశ్వరావు పెద్దమనిషి తన కార్యకర్తపై దాడి చేశానని బూతులు తిట్టినట్లు ఉన్నవి లేనట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఆరోజు అధికార మదంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులపై దౌర్జన్యం చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వారిపై ఎన్నికేసులు పెట్టారో ఆవిషయం గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ఈరోజు నువ్వు ఏదో గొప్పవాడిలాగా కబుర్లు చెబుతున్నామని ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో నీవు ఆలోచించాలని అన్నారు. నేను మీ కార్యకర్తను తిట్టినట్లు గాని ఏదైనా చేసినట్లుగానే రుజువు ఇప్పించగలవా కానీ మీ కార్యకర్త నన్ను తిట్టినట్లు ఒక ఎస్సై సాక్ష్యం అని అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార మత్తులో నీ యొక్క సైకో రాజకీయాలతో ఎదురుపార్టీ వారిని విమర్శించడం ఎదుటి పార్టీ వారి నాయకులను కవ్వించడం చేస్తూ ఉంటే వాళ్లని ప్రోత్సహించడం అలవాటని అటువంటి దారుణమైనవే వ్యక్తి నీవు అని అన్నారు. ఈరోజు పత్రిక సమావేశంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ బాధ్యతలేనని ఆరోజు నీ అధికారంలో ఉండగా అధికార బలంతో కళ్ళుకప్పి వీరందరిపై కేసులు కట్టించి నీవు ఇబ్బంది పెట్టిన వారే ఇక్కడ ఉన్నారన్నారు. అలాంటప్పుడు నీకు మాట్లాడే అర్హతలేదని మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని అదేవిధంగా మమ్మల్ని కించపరిచి మమ్మల్ని కవ్విస్తే దానిని కూడా ఎంత దూరమైనా అడ్డుకుంటామని అందులో సందేహమే లేదన్నారు. మీరు ఇంకా అధికారంలో ఉన్నారని కవ్వింపు చర్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోమని తప్పనిసరిగా మీరు చేసే దానికి ప్రతిస్పందన ఉంటుందని ఈరోజు మేము ఎటువంటి తప్పుచేయలేదని, తప్పు చేయము అలాగని, అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని కవ్వింపు చేస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా మాట్లాడినారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో 2019 సంవత్సరము నుండి 2024 సంవత్సరం వరకు కారుమూరి నాగేశ్వరరావు వైయస్సార్సీపి పార్టీలో ఉంటూ కారుమూరి పెట్టిన కేసులపై బాధలుపడిన మట్టా వెంకట్, మల్లిన రాధాకృష్ణ, కుప్పాల ఇందిరా దేవి, బొబ్బ వేణు, నొడగల బాలాజీ, కొండేటి శివ, చిత్తజల్లు సత్తిబాబు, పిల్లాడి ధనలక్ష్మి తదితరులు ఈ ప్రెస్ మీట్ నందు పాల్గొని వైయస్సార్సీపి హయాంలో పడిన వారి యొక్క బాధల గురించి వివరించినారు.


