ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, ముళ్ళపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా మంగళవారం ట్రస్ట్ హాస్పిటల్ యందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముళ్ళపూడి ట్రస్ట్ డైరెక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అంధ్రా బిర్లా, గోదావరి ప్రాంతంలో తొలితరం పారిశ్రామికవేత్తగా అనే విజయాలు సాధించి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి, తణుకు ప్రాంతాన్ని జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా నిలిపిన ఘనత హరిశ్చంద్ర ప్రసాద్ కే దక్కుతుందని అన్నారు. ఎందరో యువ పారిశ్రామికవేత్తలు ఆయనను ఆదర్శంగా తీసుకుని పరిశ్రమలు స్థాపించారని అన్నారు. ఆయన 105వ జయంతి సందర్భంగా ఈ క్యాంపు నందు డాక్టర్లు ఉచితంగా రోగులకు ఉచిత పరీక్షలు చేశారని, మందులు అందజేశారని, తణుకు పరిసర ప్రాంత ప్రజలు వచ్చి ఈ క్యాంపులో పాల్గొని ఉచిత సేవలు పొందారని తెలిపారు. ఈ క్యాంపు నందు హాస్పిటల్ డాక్టర్స్ మరియు వైద్య బృందం సిబ్బంది పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు



