ప్రతి విద్యార్ధికి ఆశయసాధనలో ఏకలవ్యుడు ఆదర్శం కావాలి

అడవిలో గురుశిక్షణ లేకుండా గురువును ఆదర్శంగా, దైవంగాభావించి విలువిద్యలో మేటి యోధునిగా రూపొందిన కోయజాతికి చెందిన ఏకలవ్యుని జయంతి ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం మోర్త ఉన్నతపాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏకలవ్యజయంతి వేడుకల్లో రాష్ట్ర ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్, ఏకలవ్య ట్రైబల్ ఫౌండేషన్ చైర్మన్ నల్లబోతుల కొండయ్య, రాష్ట్ర ఏకలవ్య ట్రైబల్ ఫౌండేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవరకొండ విజయ్ కుమార్, ఏకలవ్య ట్రైబల్ ఫౌండేషన్ ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జ్ నల్లగొండ నాగేంద్రబాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్.సి.ఎస్.టి.కమిటీ మాజీ సభ్యులు డా.కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడుతూ విలువిద్య సాధనలో గురువులేకపోయినా విద్య నేర్చుకోవాలనే తపనతో ఏకలవ్యుడు అర్జునుడికన్నా మేటి విలువిద్యను సాధించాడని అన్నారు. ప్రతీ విద్యార్ది ఏకలవ్యుడిని క్రమశిక్షణ, అచంచల సంకల్పం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నేటి యువత ఆదర్శంగా తీసుకుని విద్యాసాధనలో ముందుకు వెళ్ళాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నారాచంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వవిద్యారంగం ఎంతో ప్రగతి సాదిస్తుందని పేర్కొన్నారు. తణుకు ఆదిత్య స్కూల్ కరస్పాండెంట్ గురజా ఆదిశేషు మాట్లాడుతూ ద్రోణాచార్యుడు తన విగ్రహంతోనే గురువుగా భావించి విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడిని గురుదక్షిణగా అతని కుడిచేతి బ్రొటనవేలిని గురుదక్షిణగా అడుగుగగా ఏకలవ్యుడు ఒకేఒక్క క్షణంలో నిర్ణయం తీసుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్త పిఎసిఎస్ చైర్మన్ చిట్టిబాబు, టిడిపి నాయకులు అనపర్తి జలమయ్య, కంటిపూడి నరేంద్ర, కంటిపూడి ప్రసాద్, ఉండ్రాజవరం మండల బిజెపి అధ్యక్షులు కొప్పినీడి సత్యనారాయణ, తూగోజిల్లా ఓ.బి.సి. కార్యవర్గసభ్యులు నిడుమోలు చిన్నరాము, జనసేన పార్టీ నాయకులు డి.డి.మల్లేష్, దాసరి సుబ్రహ్మణ్యం, పి. రాజా ఫణీంద్ర, నిడుమోలు రాము, ఈ.టి.ఎఫ్. సభ్యులు ఎలుబూడి మొషియా, ఎలుబూడి వంశీ, ప్రధానోపాధ్యాయులు టి.సుభద్రాభాను, ఉపాధ్యాయులు ఎల్.ఆర్.మూర్తి, షేక్ రజియా, తాతిని రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రనాయకులు, గ్రామ టిడిపి, జనసేన, బిజేపి నాయకులు మోర్త హైస్కూల్ బాలబాలికలకు ఏకలవ్య జయంతి సందర్భంగా పుస్తకాలు, పెన్నులు ఉచితంగా అందజేశారు.

Scroll to Top
Share via
Copy link