ప్రతీ రైతు పంటల బీమాపథకం నందు నమోదు చేసుకోవాలి

తణుకు మండలంలోని కొమరవరం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కే.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం. వి. రమేష్ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నందు ప్రతి రైతు ఆగస్టు 15 లోపుతాము ఈ సార్వా కాలమునందు పండించిన ప్రతి ఎకరం వరి పొలమును పంటల బీమా పథకం నందు నమోదు చేసుకోవాలని తెలియజేశారు, ఈ పథకం నందు ఎకరానికి 210 రూపాయలు కట్టవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా పంట రుణమును ఏప్రిల్ 1 నుండి ఆగస్టు15 తారీకు మధ్యలో తీసుకున్న రైతులకు సంబంధించి సంబంధిత బ్యాంకు వారే ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ప్రీమియం అమౌంటు రైతుల తరఫునుంచి ఆగస్టు 15 లోపు ప్రీమియం అమౌంటు ఇన్సూరెన్స్ కంపెనీలకు జమ చేస్తారని అదేవిధంగా పంట రుణం తీసుకున్న పేరునే ఈ క్రాప్ నందు కూడా పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పంట రుణం తీసుకొని రైతులు కానీ సి.సి.ఆర్.సి. కార్డు పొందిన కౌలు రైతులు కానీ ఇన్సూరెన్స్ కట్టవలనంటే ఈ పంట నమోదుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా సి.సి.ఆర్.సి. కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంకు ఎకౌంటు మొదటి పేజీ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రైతు సంతకంతో కూడిన డిక్లరేషన్ ఫామ్ ని, రైతు యొక్క ఫోన్ నెంబర్ ని తీసుకుని కామన్ సర్వీస్ సెంటర్ లో కానీ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు వద్ద గాని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ 2025-26 సంవత్సరమునకు పంటలబీమా పథకమునకు అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నోడల్ ఏజెన్సీగా నిర్ణయించడం జరిగిందని పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి 42,000 రూపాయలు వస్తుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ పంటల బీమా పథకంపై ఏమైనా సమస్యలు మరియు సందేహాలు ఉన్నట్లయితే రైతు సేవ కేంద్రాలలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి.ఏ.ఏ.లు, రైతు సోదరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link