ప్రతి 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర ఇరగవరం మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ యందు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆదేశాలు అనుసరించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రత్యేక దృష్టి సారించి విస్తృత స్థాయిలో నిర్వహించారు.
ప్రతి కుటుంబ పొడి చెత్తను వేరుగా సంచుల్లో నిల్వచేసి స్వచ్ఛరథంకు ఇవ్వాలని అవగాహన కల్పించారు తడి చెత్తను ప్రతిరోజు గ్రీన్ అంబాసిడర్ ద్వారా సేకరించి సంపద సృష్టి కేంద్రాలకు తరలించడం రెండు దశల కంపోస్టింగ్ విధానం ద్వారా ఎరువుల తయారీ చేపట్టడం సాధారణంగా జరగాల్సిన ప్రక్రియ గూర్చి వివరంగా తెలిపారు.
ఇరగవరం గ్రామంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలందరూ పాల్గొని గ్రామ పరిశుభ్రతకు సహకరించవలసిందిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఉన్న రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలను పూర్తిగా తొలగించి, చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి అనే విషయం ప్రజలకు వివరించారు. రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను గ్రీన్ అంబాసిడర్లు ఇంటికి వచ్చినప్పుడు వారికి మాత్రమే అందించాలని తెలిపారు .
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, స్వర్ణ గ్రామ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ లు హాజరయ్యారు.



