కానూరులో రొయ్యల సాగుపై ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన 

కాకినాడ రాష్ట్ర మత్స్య సాంకేతిక శిక్షణ సంస్థ  ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో రొయ్యల రైతులకు “రొయ్యల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అంశంపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా  కె.రామకృష్ణ, సహాయ మత్స్య సంచాలకులు ఎస్.పీ.ఎఫ్. కాకినాడ, రైతులకు రొయ్యల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను వివరించారు. ముఖ్యంగా చెరువు సిద్ధం, నీటి నాణ్యత నిర్వహణ, నాణ్యమైన SPF సీడ్ ఎంపిక, సక్రమమైన ఫీడ్ నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యలు, నీటి నాణ్యత పరిమితుల పర్యవేక్షణ, వ్యాధుల నివారణ చర్యలు మరియు ప్రస్తుతం రొయ్యల సాగులో ప్రబలంగా కనిపిస్తున్న వ్యాధులను గుర్తించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

రొయ్యల సాగులో రైతులు క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పరీక్షించుకోవడం, నాణ్యమైన సీడ్‌ను మాత్రమే వినియోగించడం, సరైన మోతాదులో మేత అందించడం, చెరువు నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమం నిడదవోలు ప్రాంత ఏ.ఐ.ఎఫ్. వి.దేవానందం సమన్వయంతో నిర్వహించబడగా, కానూరు, కానూరు అగ్రహారం గ్రామాలకు చెందిన రొయ్యలరైతులు  అనపర్తి సత్యనారాయణ,  వైనాట్ ప్రసాద్, సాంబమూర్తి, కొండయ్య, దాసం తాతాజీ తదితర ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అధికారులు రైతుల ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు అందించి, ఉత్తమ యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం రొయ్యల రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని రైతులు అభిప్రాయపడ్డారు.

Scroll to Top
Share via
Copy link