స్థానిక యస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల యూజీ & పీజి (అటానమస్)లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పేద విద్యార్ధినులకు ‘పుస్తక వితరణ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీ సుందరీబాయి మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారని పేద విద్యార్ధినులు చదువులో వెనుకబడి ఉండకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, మానవ ప్రయత్నానికి అదృష్టం తోడైతే విజయం సిద్ధిస్తుందని మా ప్రోత్సాహానికి తోడు విద్యార్ధినులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి కాట్నం విశాలి లక్ష్మీ, (డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ కో-ఆర్డినేటర్ మరియు జనసేన పార్టీ నాయకురాలు) మాట్లాడుతూ ప్రతిభ కలిగి సింగిల్ పేరెంట్ కలిగిన విద్యార్ధినులకు పుస్తక వితరణ చేస్తున్నామని విద్య అనేది దొంగిలించలేని వస్తువు, ఎవరూ దోచుకోలేరని, ఎన్నో కారణాలు చేత పేద విద్యార్ధినులు ప్రతిభ ఉండి ధన సహాయం లేక వెనుకబడివున్నారని అటువంటి వారిని కళాశాలలో గుర్తించి సహాయం చేస్తున్నామని ఇద్దరితో ప్రారంభమై 30 మంది విద్యార్థినులు వరకు పుస్తక మరియు ధనసహాయం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి వి. ఆశాజ్యోతి, (డి.వి.ఎం.సి. మెంబర్) జనసేన పార్టీ వీరమహిళ తెలగరెడ్డి లక్ష్మి, వీర మహిళలు, విద్యార్థినులు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



