తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బులిరామయ్య భవిష్యత్ తరాలకు మార్గదర్శకునిగా నిలిచిన వ్యక్తి బోళ్ల బులిరామయ్య శత జయంతి వేడుకల సందర్భంగా గురువారం తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ రొటరీక్లబ్ సభ్యులు మల్లిన అరుణసారధి ద్రవ్య సహాయంతో ఉండ్రాజవరం పి.హెచ్.సి.వద్ద ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో భాగంగా బాలింతలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహార కిట్లను అందించారు. గర్భిణీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రొటరీ క్లబ్ అధ్యక్షులు కఠారి సిద్దార్ధ రాజు, ఆనందం మస్తాన్ రావు, అక్కిన కాశీవిశ్వనాద్, పి.హెచ్.సి.వైద్యులు వెంకటెశ్వరరావు, పి.హెచ్.సి.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



