ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఉండ్రాజవరం ఎస్సై డి. రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉండగా కొవ్వూరు మండలం, మద్దూరు గ్రామానికి చెందిన షేక్ అబ్బాస్ అనే వ్యక్తి ఏపీ 37 టిడి 1398 అనే నెంబర్ గల ఆటో మద్యం సేవించి నడుపుతూ పట్టుబడగా అతనిని గురువారం తణుకు రెండవ ఏ.జే.ఎఫ్.సీఎం. కోర్టు నందు హాజరుపరచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఎనిమిది రోజులు అనగా 9 జులై 2026 నుండి 16 జులై 2026 వరకు జైలుశిక్ష విధించినారని సబ్ ఇన్స్పెక్టర్ డి. రవికుమార్ తెలియజేశారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపిన ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు.



