కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఉండ్రాజవరం మండలంలో గ్రామాల మధ్యన ఉన్న రహదారులు గత ఆరు నెలలనుండి బి.టి. రోడ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రయాసతో కూటమి ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు వాటి పర్యవేక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో దమ్ముచక్రాలకు అనతికాలంలోనే పాడయ్యె పర్తిస్థితికి వస్తున్నాయి. వరి సాగులో భాగంగా దమ్ము చేయడానికి ట్రాక్టర్లు ద్వారా చెయాల్సిరావడంతో ఇనుప దమ్ముచక్రాలు బి.టి.రోడ్లపై వెళుతున్నందువల్ల పాడవుతున్నాయని, ఈ విధంగా చేయడంవలన మరలా యదాస్తితికి రోడ్లు వస్తాయని, తమకు గతుకుల రోడ్లపైన ప్రయాణం చేయాలని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా సంబందిత ప్రభుత్వాధికారులు ట్రాక్టర్ యజమానులకు, రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.



