వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో రైతులు కొత్త పంటల సాగుకు సిద్ధమవుతారు. ఇది పూర్తిగా రైతుల జీవితానికి సంబంధించిన పండుగ వ్యవసాయం ప్రారంభించే ముందు
భూమాతకు నమస్కారం చేస్తారు ఎద్దులను గౌరవిస్తారు,
వరుణ దేవుని ప్రార్థిస్తారు, పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఈ పండుగను తెలుగు నెల అయిన జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ
సాధారణంగా ఇది జూన్ నెలలో వస్తుంది. పంటను దేవుని వరంగా చూస్తారు, రైతేరాజు” అనే భావనను గుర్తు చేసుకుంటారు. ఈ పండుగను తెలుగు రైతుల వ్యవసాయ నూతన సంవత్సరం ప్రారంభం లాగా కూడా భావిస్తారు కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన భారతదేశంలో విత్తనాలను డ్రోన్ సాయంతో మెరుగైన పద్ధతులతో వ్యవసాయాన్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సులభతరం చేసిందని భారతదేశాన్ని అభివృద్ధి చెందే దిశగా వ్యవసారంగానికి పెద్దపీట వేశారని తెలియజేశారు. అనంతరం ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ భారతదేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యంత్రాలను సబ్సిడీ రూపంలో ఇస్తూ రైతులకు ఎంతగానో ఉపయోగపడే లాగా కేంద్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



