కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టాలి
అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృద్వి
పశ్చిమగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏ. ఐ. ఎస్. బి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృద్వి
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్ట గొడుగుల్లా ఏర్పడి పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లితండ్రులు నుండి వేళ లక్షలు రూపాయలు ఫీజుల దండుకుంటున్నారన్నారు. విద్యాసంవత్సరాలు పూర్తి అవ్వకముందే విచ్చలవిడిగా అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు. అదేవిదంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రవేట్ విద్య సంస్థలు ముందస్తు అడ్మిషన్ లు చేయడం వలన ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, పేద విద్యార్థులకి విద్య అందడంలేదని వారు పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న విద్యా దోపిడీని అరికట్టి నిబందనలకు తూట్లుపొడుస్తున్న కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రప్రభుత్వం తీరుపై అల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ విద్యార్థి సంఘంగా పెద్దఎత్తున బహిరంగ ఆందోళననలకు శ్రీకారం చుడతామని ఈ సందర్బంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఐ. ఎస్. బి. రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి వంశీ, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు దున్న వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, పట్టణ అధ్యక్షులు తానేటి అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



