ఉండ్రాజవరం పి.హెచ్.సి. అధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భముగా ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాధికారి డా. బి. దుర్గమహేశ్వర రావు ఆధ్వర్యములో డెంగ్యూ వ్యాధి పై అవగాహన ర్యాలీ, ప్రతిజ్న నిర్వహించారు. ఈ సందర్భంగా డా. దుర్గ్రామహెశ్వరరావు మాట్లాడుతూ ఈ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్తై అనే దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అని, అందువల్ల దోమల వృద్దిని అరికట్టుట వలన, దోమకాటు నుండి రక్షణ పొందుట వలన ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా నివారించవచ్చునని తెలియచేసారు. అందువలనే ప్రతీ సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు మే నెల 16 వ తేదీన “జాతీయ డెంగ్యూ దినోత్సవం“ గా భారత ప్రభుత్వం నిర్ణయించినదని తెలిపారు. ఈ వ్యాధి నియంత్రణలో వైధ్యసిబ్బంది మాత్రమే కాకుండా, ఆశా కార్యకర్తలు కూడా కీలకమైన భాద్యతలు నిర్వహిస్తున్నారని, వారు ఇంటింటికి వెళ్ళి, పరిసరాల పరిశుభ్రత గురించి, పనికిరాని వస్తువులు, పూల కుండీలు, పాత్రలు, టైర్లు, కొబ్బరిచిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు మొదలగు వాటిలో వర్షము పడినపుడు నీరు చెరీ నిల్వ ఉంటే వాటిలో దోమలు వృద్ది చెంది, తద్వారా మనకు ఈ వ్యాధి వచ్చే అవకాశము ఉంటుంది కావున ఇంటి పరిసరాలలో ఎక్కడా, నీరు నిల్వ ఉండకుండా చూడవలెనని, దీనికి గాను వారములో ఒకరోజు అనగా ప్రతీ శుక్రవారం డ్రై డే గా పాటిస్తూ, ఆరోజున ఇంటి పరిసరాలు అన్నీ శుభ్రపరచి, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అదేవిధముగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, చర్మముపై ఎర్రటి మచ్చలు, మొదలగు లక్షణాలు ఉంటే వెంటనే విధ్య సహాయం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వద్దకు వచ్చి తగిన చికిత్స పొందాలని అవగాహన కల్పిస్తారని, ఈ డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అని, కావున ప్రజలందరూ కూడా అవగాహన పెంపొందించుకుని పై జాగ్రత్తలు పాటిస్తే, దోమకాటు ద్వారా వచ్చే అనేకరకాలైన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సుబ్రహ్మణ్యం, సూపర్వైజర్లు శ్రీరామమూర్తి, మేరి రత్నకుమారి, స్టాఫ్ నర్స్ సంధ్య, ఏం.ఎల్.హెచ్.పి పూజశ్రీ దుర్గ, హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమార్, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link