తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం గ్రామంలో శ్రీ బ్రహ్మసూత్ర ప్రతిష్ట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి ప్రదోషకాలంలో త్రయోదశి సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిగినది ప్రతినెల అమావాస్య ముందర వచ్చే త్రయోదశి రోజున మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం నందీశ్వరుడికి అభిషేకం మరియు పూజలు చేస్తే శని దోషాలు పోయి ఆరోగ్యం మంచిగా ఉండి మనశ్శాంతి లభిస్తుందని మానవుడికి జీవితంలో గ్రహదోషాలు ఉన్న ఈ నందీశ్వర అభిషేకంతో దోషాలు పోతాయి అని ఆలయ అర్చకులు మద్దిరాల తారక వెంకట రమణ తెలిపినారు ఈ కార్యక్రమంలో ఆకెళ్ళ శ్రీనివాసరావు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నందీశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు




