డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు

రూ. 5 కోట్లు వ్యయంతో ప్రాసెసింగ్ యూనిట్

ప్లాస్టిక్ నివారణకు ప్రజలు సహకరించాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.గత కొన్నేళ్లుగా చెత్త కొండలా పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టామన్నారు. తణుకు పట్టణంలో నిత్యం 50 టన్నుల తడి, పొడి చెత్త ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ చెత్తను ప్రతినిత్యం ప్రాసెస్ చేసేందుకు రూ. 5 కోట్ల వ్యయంతో ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. చెత్తను ప్రాసెస్ చేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను విక్రయించి తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సంపూర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తణుకు పట్టణాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డు ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. చెత్తను ప్రక్షాళన చేసేందుకు ప్రజల సైతం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇళ్లల్లో నిత్యం ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేసి తద్వారా బయో డిగ్రేడబుల్ సంచులను వినియోగించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు వందనం పొదుపులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ బైక్ పై పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link