ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు

ఫలితాల్లోనూ అదే జోరు కనబరచుతున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడి

పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ తులసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి అవార్డులు దోహదపడతాయని చెప్పారు. నేటి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. విద్యా వైద్యం ఎక్కడ బాగుంటుందో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ నమ్ముతూ ఉంటారని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు ముందు కూటమి నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యాలు వారి పట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ తదితర అంశాలపై దృష్టి సారించారని అన్నారు. జిల్లాలోనే అత్తిలి మండలం 88 ఉత్తీర్ణత శాతం సాధించడం అభినందనీయమని అన్నారు. జిల్లాస్థాయిలో టాప్ టెన్ విద్యార్థుల్లో తణుకు నియోజవర్గం నుంచి నలుగురు ఉండడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో సైతం ఇరగవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థి మూడో స్థానం సాధించారని చెప్పారు. తణుకు నియోజకవర్గం అసాధారణ ప్రతిభ కనబరిచారని అన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు సౌకర్యాలు కల్పించడం గర్వకారణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేపట్టిన ప్రణాళికలు ఎందుకు నిదర్శనం అని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో పాటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హాజరయ్యాయి

Scroll to Top
Share via
Copy link