సూర్యలంక బీచ్ లో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న సమగ్ర అభివృద్ధి పనులను సమీక్షించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహచర మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ , బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ ఛైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ మరియు జిల్లా అధికారులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా “Bay of Bapatla” పేరుతో సూర్యలంకకు ప్రత్యేక బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు ప్రపంచ స్థాయి అనుభూతిని కలిగించేలా వెల్‌కమ్ ఆర్చ్, సైకిల్ ట్రాక్, స్ట్రీట్ లైటింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, సోలార్ పవర్ సిస్టమ్, ల్యాండ్‌స్కేపింగ్, ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాము. కుటుంబ సమేతంగా పర్యాటకులు ఆనందంగా గడిపేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు ఫెస్టివల్ కార్నివల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అడ్వెంచర్ టూరిజానికి మరింత ఊతమిస్తూ జెట్ స్కై రైడ్స్ మరియు వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాలను ప్రారంభించాము. సాగర అలలపై మంచి అనుభూతిని కలిగించే జెట్ స్కీ రైడ్ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. సూర్యలంక సముద్ర తీరం ఇప్పుడు కేవలం అందానికే కాదు.. సాహస క్రీడలకు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.
సూర్యలంక బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా కృషి కొనసాగిస్తున్నారు. అలాగే సినీ షూటింగ్‌లకు అనువైన గమ్యస్థానంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.



