కార్మికులు రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలి – డివివియస్ వర్మ

కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తూ కార్మికుల హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలపైనా దానికి వంతపాడుతూ మద్దతు దారులుగా వున్న రాష్ట్రం లోని
పాలక , ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కార్మికులు గళం విప్పాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీ అక్కమాంబ టెక్స్‌టైల్స్ అధ్యక్షుడు డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.
​శుక్రవారం తణుకులోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మే డే సభకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయడం అత్యంత దుర్మార్గమని వర్మ విమర్శించారు.
​కార్మికుల శ్రమను దోచుకోవడానికే ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చిందని ఇవి అమలులోకి వస్తే కార్మికుల హక్కులు పూర్తిగా కాలరాయబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రం తెచ్చిన ఈ ప్రజాస్వామ్య విరుద్ధ చట్టాలకు రాష్ట్రంలోని అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్షం మద్దతు తెలపడం కార్మిక వర్గానికి చేస్తున్న ద్రోహమని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు జరగాల్సింది రాజకీయ పోరాటమేనని దానికి కార్మికులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కోనాల భీమారావు, దేవ పెద్దిరాజు, కార్యదర్శి చిక్కాల దుర్గాప్రసాద్, కోశాధికారి అడుసుమిల్లి రమేష్, అయిశెట్టి రమేష్, పి. దత్తాత్రేయప్రసాద్ తదితరులు మాట్లాడారు.

Scroll to Top
Share via
Copy link