తణుకు, గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు తణుకు వారు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు తెలియచేయునది, ది 9.5.2026 వ తేదీ న తణుకు కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, భార్య భర్తల మధ్య తగదా కేసులు, బ్యాంకు ఋణ బకాయి కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు మరియు నోటు బకాయి కేసులు రాజీ చేసుకోవచ్చు, ప్రతి రోజూ కోర్టు లో మీడియేషన్ ద్వారా ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ ద్వారా న్యాయమూర్తులు కేసులు రాజీ చేస్తున్నారని, కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని, జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీచేయుట గురించి కోర్ట్ సిబ్బందిని, పోలీసు అధికారులు ను మరియు మండల న్యాయ సేవల సంస్థ, సిబ్బందిని, జాతీయ న్యాయ సేవల సంస్థ వారి టోల్ ఫ్రీ నెంబర్ 15100 నుండి తెలుసుకోవచ్చని తెలిపారు.


