పట్టాలు ఇచ్చారు స్థలాలు ఎక్కడున్నాయి చూపాలి అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేలంగి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు లబ్ధిదారులు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించి కార్యదర్శికి మెమోరాండం ను అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వరేలంగి గ్రామంలో సుమారు 350 మందికి పట్టాలు ఇచ్చారని ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఇల్లు నిర్మాణము చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . అంతన్నవారిపేటలో సుమారు 120 మందికి పట్టాలు ఇచ్చిన దారి మార్గం ఏర్పాటు చేయలేదని అన్నారు .ఇందిరానగర్ ఏరియాలో కొంతమందికి పట్టాలిచ్చారు, మరి కొంతమందికి కోర్టులో పెండింగ్ ఉన్నదని పట్టాలి ఇవ్వడం ఆపివేశారని కోర్టులో కేసు కోటి వేసిన మిగిలిన వారికి పట్టాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గమల్ల పాడు ఏరియాలో స్థలాలు ఇచ్చిన దగ్గర లో ఉన్నవారికి కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇచ్చారని దీనివలన ప్రజలు రాకపోకలు జరపాలన్న ఇబ్బందికరంగా ఉంటుందనిఅన్నారు . అదే ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఇద్దరు మరణించారని అందువలన ఆ ప్రాంతమునకు లబ్ధిదారులు వెళ్లాలన్న భయపడుతున్నారని వాళ్లు తెలిపారు. రేలంగి గ్రామంలో ఒకరికి కూడా ఇప్పటివరకు ఇల్లు నిర్మాణము జరగలేదని పట్టాల్సిన వారికి స్థలాలు చూపించి ఇల్లు నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి ఇల్లందుపత్తి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఆయన అన్నారు .వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బల్ల చిన్న వీరభద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచితాలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఈ మోసం ఎంతో కాలం సాగదని ఆయన అన్నారు. కట్టాలిచ్చిన వారందరికీ ఐదు లక్షలు ప్రభుత్వం ఇచ్చి విల నిర్మాణాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి, నీలాపు ఆంజనేయులు లబ్ధిదారులు D. చిన్నమ్మ
గోడల సత్యనారాయణ, అనసూయ, శివపార్వతి ,ఆర్ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.


