మున్సిపల్‌ కార్యాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పలు విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశం

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అత్యవసరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్, అడ్మిన్, రెవెన్యూ విభాగాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల నాణ్యత పరిశీలించి సందర్శకులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link