పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి
• ర్యాలీలో పాల్గోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, సోము వీర్రాజు, పలువురు నేతలు
• మహిళా బిల్లును అడ్డుకున్న రోజును ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి
• మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులని పేర్కొన్న సీఎం
• మహిళా సమాజానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• మహిళల్ని ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించిన సీఎం
• మూడు దశాబ్దాల మహిళా రిజర్వేషన్ కలను ప్రతిపక్ష పార్టీలు చెరిపేశాయని పేర్కొన్న ముఖ్యమంత్రి
• మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం మహిళలకు ద్రోహం చేయడమేనన్న సీఎం చంద్రబాబు


