వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ఫూలే తన జీవితాన్ని అంకితం చేశారు

 మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి శ్రీమతి ముళ్ళపూడి రేణుక శనివారం తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సత్యశోధక సంఘాన్ని స్థాపించి,సామాజిక సమరసత కోసం పాటుపడిన వైతాళికుడు,కుల వ్యవస్థలోని అంతరాలను రూపుమాపేందుకు అహర్నిశలు కృషిచేసిన జ్ఞాన పథికుడు. విద్య ద్వారానే విముక్తి లభిస్తుందని నమ్మి, సమాజంలో పేరుకుపోయిన అసమానతలపై రాజీలేని పోరాటం చేసిన ధన్యజీవి పూలే, ముఖ్యంగా మహిళా విద్య కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన వేసిన పునాదులు నేటికీ మనందరికీ మార్గదర్శకాలు ఆయన ఆశయ సాధనలో భాగస్వాములవుతూ, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పునరంకితమవ్వడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పట్టణ అధ్యక్షులు బొల్లాడ  నాగరాజు, బిజెపి నాయకులు కొడమంచిలి జితేంద్ర, పులమాల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

.

Scroll to Top
Share via
Copy link