అత్తిలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అత్తిలి పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు ఆల్తి సత్యనారాయణ నియామకం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా పార్టీను నమ్ముకుని ఉంటున్న కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవం అని కొనియాడారు. గత 35 ఏళ్లుకు పైగా తెలుగుదేశం పార్టీ అత్తిలి మండల కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.




