ఉసులుమర్రులో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

వివిధ అభివృద్ధి పనుల పరిశీలన.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

నిడదవోలు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆరోగ్య కేంద్రం పనుల పరిశీలన:నేషనల్ హెల్త్ మిషన్ నిధులు రూ. 36 లక్షలతో నిర్మిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు.

గోదావరి తీరంలో సౌకర్యాల కల్పన: ఉసులుమర్రు వద్ద గోదావరి నది రేవు మెట్లపై భక్తులు, స్థానికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న షెడ్ పనులను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. ఎండ, వానల నుండి రక్షణ పొందేలా ఈ షెడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

రహదారి వెడల్పుపై హామీ: ఉసులుమర్రు గ్రామంలోని ప్రధాన రహదారికి సంబంధించి 18 ఫీట్ల వెడల్పుకు బదులుగా ప్రస్తుతం 12 ఫీట్ల రహదారి మాత్రమే మంజూరైన విషయాన్ని స్థానికులు మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దుర్గేష్ భవిష్యత్ లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి వెడల్పుతో కూడిన 18 ఫీట్ల ప్రధాన రహదారి మంజూరుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు స్వాగతం:అంతకుముందు నిడదవోలు విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు ప్రాంతీయ అంశాలపై చర్చించారు.

ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link