ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తణుకు శ్రీ మారుతీ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో శనివారం తెలుగు భాష సాంస్కృతిక కలల వేదిక సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కవిత్వం లేని భాష లేదు అందని భావం లేదు అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. అనంతరం ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టీడి హరే రామ వెంకట నాగరాజును, కవి ముంగండ లక్ష్మణ సుబ్బారావును నిర్వాహకులు ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మార్గని రాంబాబు, పేరూరి నాగేశ్వరరావు, బెజ్జవరపు లక్ష్మణ్ కుమార్, సుంకవెల్లి లోకేష్, కాలే లక్ష్మణరావు, మారుతి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లొల్ల పద్మజ, వై. రమణ సత్య తదితరులు పాల్గొన్నారు.




