తణుకు – సామాన్యులకు అర్థమయ్యే రీతిలో, అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి ‘‘మొల్లమాంబ’’ గొప్ప దార్శనికురాలని మాజీమంత్రి శ్రీ డా.కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.శుక్రవారం ఆమె జయంతిని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్క్ సమీపంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడంతో పాటు నాటి సమాజంలో నెలకొన్న లింగ, కుల వివక్షతలను బద్దలు కొట్టి చరిత్రలో చిరస్థాయిగా మొల్లమాంబ నిలిచిందని కొనియాడారు.కవయిత్రి మొల్ల సమాజ శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడ్డారని తెలిపారు.మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ శాలివాహనులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి వారిని అక్కున చేర్చుకున్నారని కవయిత్రి మొల్లమాంబ జయంతి రోజును రాష్ట్ర పండుగగా జరపాలని జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక వారిని పట్టించుకొనే దిక్కులేకుండా పోయిందని అన్నారు.
అనంతరం ఏపీ కుమ్మర శాలివాహన సేవ సంఘం నాయకులు బిరుదుకోట.చింతన్నా ప్రసంగిస్తూ మహిళలు చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన కవయిత్రి మొల్ల అని కొనియాడారు. ఆరు కాండాలు, 871 పద్యాలతో కూడిన రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనమన్నారు.రామాయణం అందరికీ ఆదర్శం, ఆచరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, జిల్లా నాయకులు జల్లూరి జగదీష్, ఇ.బలరామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు యారపాటి రామకృష్ణ, మైనార్టీ నాయకులు జిలానీ, పైడి సాయి సూర్య తదితరుల నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




