గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

• ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన

• నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం

• పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి

• గిరిపుత్రులతో కలసి మధ్యాహ్నభోజనం

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరిపుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొననున్నారు. శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగరువు అనే గిరిజన గ్రామంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

తొలుత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరిస్తారు.

అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన పరిశీలిస్తారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామప్రజలతో నిర్వహించే మాటా-మంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజనులతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

Scroll to Top
Share via
Copy link