కోరిమామిడి గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన సమావేశం
నిడదవోలు మండలం మండలం సమీశ్రగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరిమామిడి గ్రామంలో సైబర్ నేరాలు, జూదం నియంత్రణ, ఎల్‌హెచ్‌ఎంఎస్ (LHMS) వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి వి జి తిలక్ఆధ్వర్యంలో సమీశ్ర గూడెం ఎస్సై బాలాజీ సుందర్రావు . పాల్గొన్నారు..
✍️✍️ఈ సమావేశం జరిగింది.
గ్రామస్థులతో నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల గురించి పోలీస్ అధికారులు వివరించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని, బ్యాంక్ వివరాలు తెలియజేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అదేవిధంగా గ్రామాల్లో జూదం, అక్రమ కార్యకలాపాలు జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్ వ్యవస్థ గురించి కూడా ప్రజలకు వివరించారు.
రాబోయే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి మరియు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్థులు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

