(తణుకు) 2026 సంవత్సరానికి గాను మొదటి జాతీయ లోక్ అదాలత్ మార్చి 14వ తేదీన తణుకు కోర్టు యందు నిర్వహిస్తున్నారు. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి పత్రికా ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనోటు బకాయి కేసులు, మోటారు వాహనాలు ప్రమాదం కేసులు, భార్య భర్తల కుటుంబ తగాదా కేసులు, మనోవర్తి కేసులు, డొమెస్టిక్ వయెలెన్స్ కేసులు, బ్యాంకు ఋణ బకాయిలు కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు, చిన్న చిన్న తగాదా విషయంలో కేసులు రాజీ చేసుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని, ప్రతి రోజు కేసులు ప్రీ లోక్ అదాలత్ చర్చల ద్వారా, మీడియేషన్ కౌన్సిలింగ్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చని, జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకొనుటకు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్ట్ సిబ్బంది మరియు మండల న్యాయసేవా కమిటీ తణుకు సిబ్బందిని సంప్రదించి తెలుసుకోవచ్చని, మరియు ప్రీ లిటిగేషన్ కేసులు గా బ్యాంకు ఋణ బకాయి కేసులు, టెలిఫోన్ బిల్లు బకాయి కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని కేసులు వున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని డి. సత్యవతి కోరుతున్నారు.




