తణుకు సుచిరిండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడిన సర్.సి.వి. రామన్ స్టేట్ లెవల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ లో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్. కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన సర్.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ నైట్ లో సుచిరిండియా ఎమ్.డి. అండ్ సి.ఇ.వో వై.కిరణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీకాంత్ మరియు శివాజీ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
దీనిలో భాగంగా రాష్ట్రస్థాయిలో 3వ తరగతికి చెందిన టి.సత్య మోనిష్ మొదటి ర్యాంకు, జిల్లాస్థాయిలో 9వ తరగతికి చెందిన కె. బాలు మహేంద్ర వెంకట సాయి మరియు 5వ తరగతికి చెందిన ఉత్కర్ష త్రిపాఠి మొదటి ర్యాంకులు, 7వ తరగతికి చెందిన ఎన్.సాకేత్ రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ముఖ్య అతిధులు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, మెమెంటో, సర్టిఫికెట్స్, రూ.5000/- నగదు బహుమతులు అందజేశారు.
ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ ఎన్. సుధాకర్ వర్మ, బి. విద్యాకాంత్, ఎల్.కె.త్రిపాఠి, ప్రైమరీ ప్రిన్సిపాల్ టి.సంధ్య, పురబి త్రిపాఠి, డి.పద్మజ, వి.శ్రీలత, ఎన్. మాణిక్య మాధురి, షేక్ సల్మా, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.


