ఉపాధి హామీ పథకం పాతవిధానమే కొనసాగించాలి

ఉపాధి హామీ పథకం పాత విధానమే కొనసాగించాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవార నాడు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిసరించి ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలని పాత విధానాన్ని కొనసాగించాలని కోరుచు సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలోని 15 సచివాలయంలో కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొత్త చట్టం వలన కార్మికులకు 125 రోజులు పని దినాలు ఉంటాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3 వేల కోట్లు ఉపాధిహామీ పథకాన్ని కేటాయించి కేవలం 90 కోట్లు మాత్రమే ఇవ్వడాని చట్టాన్ని నీరుగాచటమే అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బల్ల చిన్నావీరభద్రం మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు వలస వెళ్లకుండా ఉపాధి కల్పించే పథకం ఉపాధిహామీపథకం దానిని కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా మార్చి వేసిందని అన్నారు. గ్రామాల్లో పనులు పంచాయతీలుకు కేటాయించకుండా వాటి అధికారాలను కేంద్ర ప్రభుత్వము అధీనంలో పెట్టుకోవడం కేవలం బిజెపి పాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేసుకోవడానికి మార్చారని ఆయన అన్నారు. పాత విధానాన్ని కొనసాగించకపోతే ఉద్యమాన్ని ఉద్రితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జుత్తిగా రామాంజనేయులు, ఖండవలి రాంబాబు, ఎల్లందరు సత్యనారాయణ దంపనబోయిన కనికేశ్వరరావు, తామరపల్లి ముసలయ్య జక్కం చెట్ట గంగాధర్ రావు తదితరులు.

Scroll to Top
Share via
Copy link