స్వర్ణకారసంఘ అభివృద్దికి విశేషసేవలందించిన సీనియర్ సంఘసభ్యులకు ఘననివాళులు

తణుకు పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వర్ణకార సంఘ అభివృద్దికి విశేషసేవలు అందించిన సీనియర్ సంఘసభ్యులు పశ్చిమగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ మాజీ అధ్యక్షులు చిప్పాడ వెంకటేశ్వరరావు, పట్టణ స్వర్ణకార సంఘ మాజీ అధ్యక్షులు అప్పల బత్తుల అప్పారావు, స్థానిక సంఘ సీనియర్ నాయకులు చిప్పాడ శ్రీనివాస్ లకు వర్ధంతిసభ ఏర్పాటు చేసినారు. తొలుత వెంకటేశ్వరరావు చిత్రపటానికి జిల్లా స్వర్ణకార సంఘ మాజీ ప్రధాని కార్యదర్శి గురజాపు రాజలింగాచారి పట్టణ స్వర్ణకార సంఘం గౌరవాధ్యక్షులు శొంఠియాన లక్ష్మణరావు పూలమాలాంకృతిలను చేసి నివాళులర్పించినారు, ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా సంఘానికి చేసిన సేవలను కొనియాడారు, ఆయన సుమారు 20 సంవత్సరములు స్వర్ణకార సంఘానికి సేవలందించి తదుపరి జిల్లా అధ్యక్ష పదవిని పట్నాల శేషగిరిరావు కి అప్ప చెప్పారని తెలిపారు. రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లాసంఘం మంచి పేరు తెచ్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కీర్తి శివప్రసాద్ పట్టణ అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, తమిరి శ్రీనివాస్ (వెండి శ్రీను) బొల్లోజు మల్లికార్జునరావు, అనుపోజు జగన్నాథం, కడలి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link