నూతన హై మాస్ట్ వీధి దీపాలతో చీకటిని తరిమికొట్టిన గంకల కవిత అప్పారావు యాదవ్
నూతన వీధి దీపాలతో దొంగతనాలు,చీకటి ప్రాంతం బేడద తొలగింపోయిందని స్థానికులు హర్షం
గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంతో సంతృప్తి చెందుతున్న 48వ వార్డు ప్రజలు
జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో హై మాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్,జీవీఎంసీ మేయర్,ఏపీఈపీడీసీఎల్ సీఎండి లకు పలుమార్లు వినతులు చేశారు.గంకల కవిత అప్పారావు యాదవ్ పిర్యాదుపై అధికారులు స్పందించి గతంలో రింగ్ పోల్స్ ఏర్పాటు చేసి హై మాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నూతన వీధి దీపాల హామీ మేరకు మంగళవారం వార్డులో ఇందిరా నగర్ -4 లో హైమోస్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు.గంకల కవిత అప్పారావు యాదవ్ పగలు,రాత్రి తేడా లేకుండా కార్మికులతో కలిసి వార్డులో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు వెలుగులను అందించారు.ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ 48 వ వార్డు అంతా కొండ ప్రాంతం కావడంతో చీకటి ప్రదేశం నెలకొంటుందని,ఈ చీకటి ప్రదేశంలో ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయని, నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని పలుమార్లు కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్,జీవీఎంసీ మేయర్,ఏపీఈపీడీసీఎల్ సీఎండి లకు వార్డులో నూతన రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలని వినతి అందజేయడం జరిగిందని, ఇదే విషయంపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించడం జరిగిందన్నారు. గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుని వార్డులో హై మాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలనీ పోరాటం చేశామని ఈ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.పలు మార్లు అందించిన వినతులపై జీవీఎంసీ కమిషనర్,మేయర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి హై మాస్ట్ వీధి దీపాలు కేటాయించడం జరిగిందని వాటిని ఇందిరా నగర్ -4లో ఏర్పాటు చేయడం జరిగిందని,వీటి ద్వారా ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాల వెలుగులను కురిపిస్తున్నామన్నారు. వార్డులో మరిన్ని వీధి దీపాలు,సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామని గంకల హామీ ఇచ్చారు.48వ వార్డులో నూతన హై మాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు పట్ల గంకల కవిత అప్పారావు యాదవ్ కృషి ఫలించిందని, వార్డులో గంకల కవిత అప్పారావు యాదవ్ కృషితో నూతన వెలుగులు వెలగడం పట్ల పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల కవిత అప్పారావు యాదవ్ సూచించారు.


