భారతదేశ మొట్టమొదటి మహిళా మహిళా పాఠశాల స్థాపకురాలు ఉపాధ్యాయురాలు అయిన సావిత్రి భాయ్ పూలే 195వ జయంతి సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు ప్రాథమిక పాఠశాల నెంబర్ 8లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తొలి బాలిక పాఠశాల స్థాపకురాలు జ్యోతిరావు పూలే అని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాళాబత్తుల సుజాత మాట్లాడుతూ తొలితరం మహిళా ఉద్యమకారిణి భారత మహిళా మూర్తులకు ఆదర్శ మహిళమణి అని అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడి ఆమె జీవిత విశేషాలను వివరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఉపాధ్యాయురాలు ఆదూరి రాజరాజేశ్వరీలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యనమండ్ర లక్ష్మీ కిరణ్మయి, గోపరాజు కనక భాస్కర వెంకటలక్ష్మి, సుందరపల్లి లావణ్య, పంచదార్ల రమ్య, కే.జీ. సరస్వతి, ఇతరులు రెంటాల మల్లికార్జున ప్రసాద్, కోరా సత్యనారాయణమూర్తి, ముక్కామల మోహనరావు బర్రె శ్రీనివాస్, ఆలపాటి సుబ్బారావు కే.శ్యామ్, కే. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


