తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో 2025 డిసెంబర్ 10వ తేదీన జరిగిన దొంగతనంలో అంతర్ జిల్లా నేరస్థుడుని అరెస్టు చేసిన నేపథ్యంలో శనివారం నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో సిఐ పీ వి జి తిలక్ మాట్లాడుతూ జనవరి రెండవ తేదీ రాజమహేంద్రవరంలో అరెస్ట్ కాబడిన ముద్దాయి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి రాత్రి లేదా పగలు సమయాల్లో అత్యంత చాకచక్యంగా బంగారు ఆభరణాలు దోచుకు వెళతాడని తెలిపారు. ఇటీవల ఉండ్రాజవరంలో జరిగిన ఉండ్రాజవరం చొరీలో అంతర్ జిల్లా నేరస్తుని అరెస్ట్ దొంగిలించబడిన 223 గ్రాములు బంగారం 250 గ్రాముల వెండి వస్తువులు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ కేసులో నగదు ఒక లక్షరూపాయలు, ఆభరణాలు 19 34వేల రూపాయల విలువగల రికవరీ అయినట్టు తెలిపారు. ఈ ముద్దాయి పై 35 పాత కేసులు ఉన్నాయని, అక్టోబర్ నెలలో జైలు నుండి విడుదలైన తర్వాత మరల నేరాలు చేయడం మొదలు పెట్టాడని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వి. జి. తిలక్ తెలిపారు. ఈ కేసు చేదించడంలో సీసీ కెమెరా, నేర స్థలంలో లభించిన భౌతిక ఆధారాలు ఉపయోగపడ్డాయని, అందువల్ల శశి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన రక్షణ పొందడమే కాకుండా, నేరాలు జరిగినచో వాటిని చేదించడంలో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కేసు అనతి కాలంలో చేదించిన ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై డి. రవికుమార్, హెచ్‌సీ వి. బుజ్జి, హెచ్‌సి. జ్యోతి బాబు, పీసీ జి సాంబయ్య, పిసి రెహ్మాన్, పీసీ పి. కృష్ణాజిరావు, పిసి ఎన్వి రామాంజనేయులను తూ.గో.జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, డిఎస్పి జి. దేవకుమార్ అభినందించి రివార్డ్స్ అందించారు.


