రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా 10 శాతం బడా కార్పొరేట్లు దగ్గర పోగుపడిన సంపద వల్లే సమాజంలో అంతరాలు పెరిగి పోతున్నాయని దారి దీపం సంపాదకులు డి వి వి యస్ వర్మ అన్నారు.
కార్పొరేట్లు, బిలియనీర్ల దగ్గర పోగుపడ్డ సంపద మీద సంపద పన్ను , విపరీత ఆదాయం పై విండ్ ఫాల్ పన్నులు, వారసత్వ పన్నులు విధించి
పేదలకు , సామాన్యులకు వివిధ పద్ధతులలో పునః పంపిణీ చేసి ఆంతరాలు తగ్గించాలన్న నినాదంతో ప్రజా రిపబ్లిక్ ఉద్యమం ప్రారంభమైందని ప్రకటించారు.
స్థానిక సురాజ్య భవనం లో ప్రజా రిపబ్లిక్ ఉద్యమం పరిచయ కార్యక్రమంలో భాగంగా అక్కమాంబ & సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది
ఎ ఐ టి యు సి నాయకులు కోనాల భీమా రావు మాట్లాడుతూ దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష రాజకీయాన్ని పట్ల కార్మికులు ఆప్రమత్తంగా వుండాలని అన్నారు,
ముఖాముఖీలో పాల్గొన్న కార్మికులు ఈ ఉద్యమం పట్ల చాలా ఆసక్తిని కనబరిచారు.ఈ ఉద్యమ ప్రచార కార్యక్రమాలలో భాగస్వాములు అవుతామని ప్రకటించారు. కార్మికులలో ప్రచారాన్ని సాగించడానికి కొందరికి ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తామని తెలియజేశారు.
కార్మిక సంఘాల నాయకులు చిక్కాల దుర్గా ప్రసాద్, దేవ పెద్దిరాజు, దాకే ముసలయ్య, అట్రు వెంకట్రావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.


