డిమాన్ పవన్ కు తణుకు ప్రజలు అండగా నిలబడ్డారు

బిగ్ బాస్ లో మూడో స్థానంలో నిలిచిన పవన్

అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

బిగ్ బాస్ సీజన్ 9 లో అంచనాలకు మించి ప్రతిభ చూపించి తృతీయ స్థానంలో నిలిచిన డిమాన్ పవన్ కు తణుకు ప్రజలు అండగా నిలిచారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. తణుకు పట్టణానికి చెందిన డిమాన్ పవన్ ఆదివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించి మాట్లాడారు. తాము ఎంచుకున్న రంగాల్లో యువకులు ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా పట్టుదల, కృషితో సాధించిన పవన్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. స్వశక్తితో బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రవేశించి చివరివరకు పోటీలో నిలిచి తన ప్రతిభను చూపించారని చెప్పారు. భవిష్యత్తులో సైతం ఉన్నత స్థానానికి వెళ్లి మరింత ప్రతిభ కనబరచాలని కోరారు. తణుకు పట్టణానికి చెందిన అనేక మంది యువకులు పలు రంగాల్లో ఎంతో స్ఫూర్తిగా నిలవడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు తల్లిదండ్రులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు.

Scroll to Top
Share via
Copy link