ఇరగవరం డిసెంబర్ 27 ఆల్ ఇండియా సిఐటియు మహాసభ జనవరి 4వ తేదీన జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు ఇరగవరం మండలం కన్వీనర్ జిత్తికి రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రం ఇరగవరంలో బహిరంగ సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గాన్ని, కార్మిక చట్టాల్ని అంతం చేయడం కోసం బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. కార్మికుల ఉన్నచట్టాలన్నిటిని మార్చి వేసి బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలను తీసుకొస్తున్నారు అని అన్నారు .కార్మిక ఉద్యోగుల సమస్యలపై సిఐటియు అలుపెరగని పోరాటం చేస్తుందని రామాంజనేయులు తెలిపారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఆల్ ఇండియా సిఐటియు మహాసభలు జరుగుతున్నాయని 31 నుంచి మూడో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు సమస్యలపై తెచ్చేస్తారని కర్తవ్యాలను రూపొందిస్తారని తెలిపారు. జనవరి 4వ తేదీన ఆల్ ఇండియా సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభ ద్వారా ప్రభుత్వ బహిరంగంగా తెలియజేస్తారని రామానుజులు అన్నారు కార్మికుల సమస్యలు పరిచారమే వరకు పోరాటాలు సాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.వేణుగోపాల్ రావు, ఏం.సత్యవతి, పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


