ఎస్సీలపై వివక్ష చూపుతున్న మాజీ మంత్రి కారుమూరి

దళిత అధికారులను అవమానిస్తున్న తీరు దారుణం

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా సాయిబాబు విమర్శలు

చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు

తణుకు నియోజవర్గలోనే ఎస్సీ అధికారులపై వివక్ష చూపుతూ వారి పట్ల అవమానకరంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు మాట్లాడుతున్నారని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఇరగవరం మండలం మాజీ జడ్పిటిసి సభ్యులు చొక్కా సాయిబాబు అన్నారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకు తేతలి వైజంక్షన్ వద్ద గురువారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో హంగామా సృష్టించిన మాజీ మంత్రి కారుమూరి ఒక దళిత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను దుర్భాషలాడుతూ వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. పోలీసు అధికారుల పట్ల కారుమూరి వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. పచ్చ చొక్కా వేసుకో అంటూ అవహేళనతో వ్యగ్యంగా అహంకార పూరిత ధోరణితో మాట్లాడారని చెప్పారు. గతంలో దళిత మున్సిపల్ కమిషనర్ ను టిడిఆర్ కుంభకోణంలో ఇరికించడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గానికి చెందిన మండల విద్యాశాఖ అధికారిని సైతం బదిలీ చేయించారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుని తర్వాత ఎస్సీ లపై వివక్ష చూపుతున్నారని ఎద్దేవా చేశారు. తణుకు నియోజకవర్గంలో ఫ్లెక్సీల సంస్కృతి తీసుకువచ్చింది మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాదా అని ప్రశ్నించారు. ఒకపక్క రైతులను తిడుతూ, మరోపక్క మహిళలను అవమానకరంగా మాట్లాడుతూ, అధికారులను సైతం దుర్భాషలాడుతూ మాజీ మంత్రి కారుమూరి అహంకారానికి నిదర్శనమని అన్నారు. పైడిపర్రు మాజీ వార్డు కౌన్సిలర్ తాడిపర్తి శ్యాంబాబు మాట్లాడుతూ గతంలోనూ అదే స్థానంలో ఫ్లెక్సీలు కట్టినప్పుడు మాట్లాడని వైసిపి నాయకులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కనీసం విగ్రహాన్ని సైతం ప్రారంభించుకోలేని పరిస్థితుల్లో కేవలం ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మాజీమంత్రి కారుమూరి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కూటమినాయకులు, దళిత సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link