ఉండ్రాజవరం గ్రామంలో లింగాలపేట రామాలయం వద్ద గురువారం భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బూరుగుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయి 101 వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగినది. అటల్ బీహారి వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించడంలో గొప్ప వ్యక్తి అని కార్యక్రమం పాల్గొన్న వారంతా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కిన గోపాలకృష్ణ సీనియర్ నాయకులు బురుగుపల్లి కాశీ విశ్వనాథం, డాక్టర్ సుంకవల్లి సూర్యనారాయణ, ఆకెళ్ళ శ్రీనివాసరావు, ముండూరి సత్యనారాయణ ( బుజ్జి), ఏలేశ్వరపు భాస్కరరావు, ఏలేశ్వరపు ఎజ్జిన్నారాయణ, కోడూరి శ్రీధర్, కరుటూరి రామకృష్ణ పాల్గొన్నారు. తదనంతరం స్వీట్లు బిస్కెట్లు పంచిపెట్టారు.


