బీజేపీ నేతలతో కలిసి వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే భీమవరంలో సోమవారం జరిగిన అటల్–మోడీ సుపరిపాలన యాత్రలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్‌తో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద మొదలైన ఈ ర్యాలీ వేలాది మంది ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో జైత్రయాత్రలా సాగింది. అనంతరం ఉండి బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించి అనంతరం సభలో పాల్గొనడం జరిగింది. అటల్ జీ ఆశయ సాధనే లక్ష్యంగా, మోడీ నాయకత్వంలో సుపరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.


