రాజమహేంద్రవరంలోని గోరక్షణ పేటలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.
“అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అజేయ దేశభక్తి, సువ్యవస్థిత పరిపాలన, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అయిన అటల్ బిహారీ వాజ్పేయ్ కి అంకితంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


