మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగంగా తణుకు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అనంతరం ఈ సందర్భంగా గత 2 నెలలుగా మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్ వారికి జీతాలు ఇవ్వటం లేదని తెలిసి మున్సిపల్ శానిటరీ కార్మికులందరికీ (సుమారు 200 కుటుంబాలకు) నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి భీమారావు, సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


