ఆర్థిక అసమానతలు తొలగించడానికి పేదలకు సహకారం

20 మంది పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు లబ్ది

రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి

సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీ4 విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు రాష్ట్రమంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన 20 కుటుంబాలకు తోపుడుబండ్లు, తినుబండారాలు తయారు చేసే బడ్డీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో సోలార్ వ్యవస్థను ప్రతి కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు ఇందులో భాగంగా తనుకుని ప్రతి నియోజకవర్గంలో సుమారు పదివేల మందికి సోలార్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మన కుటుంబానికి సరిపడా విద్యుత్తును మనమే తయారు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలని కోరారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు సబ్ స్టేషన్ల మంజూరుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో పి4 విధానంలో భాగంగా తోపుడు బళ్ళు, ఎగ్ కార్ట్స్ అందజేసినట్లు తెలిపారు. 20 మంది లబ్ధిదారులకు 15 తోపుడు బండ్లు, ఐదు కార్ట్స్ అందజేశారు. స్థానికంగా ఉన్న నెక్ అసోసియేషన్ సహకారంతో ఐదుగురికి రూ. 50 వేలు విలువైన ఎగ్ కార్డ్స్ తో పాటు 15 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎన్ కే మెరైన్ సహకారంతో రూ.2.50 లక్షలు విలువైన తోపుడు బళ్లు అందజేశామన్నారు. కోడిగుడ్డును నిత్యజీవితంలో అలవాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు ప్రతిరోజు గుడ్డు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్యలు చేసుకుంటున్నామని అన్నారు. పి4 విధానంలో సంస్థలు, దాతలను ప్రోత్సహించే వారి ద్వారా సహాయ కార్యక్రమాలు అందించే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link