ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నేషనల్ లోకల్ సర్వీసెస్ అథారిటీ ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, తణుకు మండలం న్యాయ సేవా అధికార సంస్థ మరియు తణుకు డిస్ట్రిక్ట్ కోర్ట్ అడిషనల్ జడ్జి ఆదేశానుసారం ఉండ్రాజవరం గ్రామంలో ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. తణుకు మండల పి ఎల్ వి పిఎల్వి, పాలంగి పిఏసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న (నాని) ఆధ్వర్యంలో ఉండ్రాజవరం గ్రామంలో సుంకవల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా పిఎల్వి, పాలంగి పిఏసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న (నాని) మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అందరూ అవగాహన పెంచుకోవాలని అదేవిధంగా విద్యార్థి దశ నుండే ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడడం వల్ల వ్యాధి నిర్మూలన చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సంకువల్లి స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు విద్యార్థులతో నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.


