‘స్వచ్ఛ తణుకు’ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
వ్యర్ధాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. వ్యర్ధాలు కారణంగా పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. రోటరీ క్లబ్, విశ్వ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ తణుకు పేరుతో శనివారం నిర్వహించిన వర్క్ షాప్ లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. వ్యర్ధాల నిర్మూలనకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషితో పటు ప్రజల సహకారం కూడా ముఖ్యమని చెప్పారు. స్వచ్ఛ తణుకు నెరవేరే క్రమంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడకు అతి ప్రధానమైన నేల, నీరు, గాలి కాలుష్యం బారిన పడటం ద్వారా భవిష్యత్తులో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట కాలువలు సైతం కాలుష్యం బారిన పడుతుండడంతో రైతులు నుంచి ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో కూడా పారిశుద్ధ్య నిర్వహణపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యం తోనే పర్యావరణాన్ని కాపాడుకోగలమని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యలు, విశ్వ ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


